Site icon NTV Telugu

పోలీసుశాఖలో మళ్లీ కరోనా కలకలం

police

police

పోలీసు శాఖలో మళ్లీ కరోనా మహమ్మారి కేసులు కలకలం సృష్టిస్తున్నాయి… రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకుతుంది… హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనాబారినపడ్డారు… వరుస ఉత్సవాలు, బందోబస్తులు , నిరసనలు, ఆందోళనలతో పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది… ఇప్పటికే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్‌ వేశారు.. అయితే, ఆందోళనలు ముట్టడి కార్యక్రమాలు ఉంటుండడంతో పోలీసులకు కరోనా టెన్షన్ వెంటాడుతోంది… గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఇదే సమయంలో పోలీసు శాఖలోనూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.

పండుగలైనా.. నిరసన, ఆందోళన కార్యక్రమాలు.. ఇలా ఏవైనా పోలీసులే ముందు ఉండాల్సిన పరిస్థితి.. ఈ మధ్య వరుసగా ఉత్సవాలు జరిగాయి… బక్రీద్‌, బోనాలు, ఘట్టాల ఊరేగింపు ఇలా బందోబస్తులో బిజీగా గడిపారు పోలీసులు.. మరోవైపు.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఆందోళనలను అడ్డుకోవడంలోనూ వారే ముందు ఉండాల్సిన పరిస్థితి.. దీంతో.. మళ్లీ కరోనా మహమ్మారి క్రమంగా పోలీసుశాఖలో వ్యాపిస్తోంది. మరోవైపు.. ప్రతిపక్షాలు వరుసగా ఆందోళనకు సిద్ధం అవుతుండడం కూడా.. పోలీసు శాఖను మరింత టెన్షన్‌ పెడుతోంది.

Exit mobile version