కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి బయటపడేందేకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా మరోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు అందోళనల చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యం 900 మందికి పైగా కరోనాతో మృతి చెందుతున్నారు. రష్యాలో అనేక ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా జరగడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. బుధవారం రోజున 929 మరణాలు చోటుచేసుకోగా, గురువారం రోజున 924 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో ఇప్పటి వరకు కేవలం 29 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రష్యాలో తిరిగి ఆంక్షలు మొదలయ్యాయి. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నది. రష్యాలోని థియేటర్లు, రెస్తారెంట్లకు కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు.
భయపెడుతున్న కోవిడ్: అక్కడ రికార్డ్ స్థాయిలో మరణాలు…
