అక్టోబర్ 8, శుక్రవారం దినఫలాలు

మేషం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్నిసందర్శిస్తారు.

మిథునం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారికి ఏకాగ్రత మెళకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. గతంలో చేసిన పనులకు ఇపుడు ఫలితాలు కలుగుతాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు.

కర్కాటకం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, చికాకుల వల్ల ఆందోళనలకు గురవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నారుల విద్యా విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. సన్నిహితుల సలహాలు, హీతోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.

కన్య : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.

తుల : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంభాషించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మిత్రులను కలుసుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి.

వృశ్చికం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ రాక బంధువుల ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇంటి పాత రుణములు కొన్నింటిని తీరుస్తారు. వృత్తి వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.

ధనస్సు : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానంతో అభిప్రాయభేదాలు వస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది.

మకరం : రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ పట్టుదల నిదానంగా నెరవేరుతుంది. వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.

కుంభం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మెళకువ అవసరం.

మీనం : బంధువుల రాకతో కొన్ని పనులు వాయిదాపడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. సొంత వ్యాపారాలు లీజు, ఏజెన్సీల త్వరలో అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు.

-Advertisement-అక్టోబర్ 8, శుక్రవారం దినఫలాలు

Related Articles

Latest Articles