కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఒకవైపు అధికార బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్ర నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థుల తరుపున సినీ తారలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ప్రచారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీనటుడు కమల్ హాసన్‌ను కాంగ్రెస్ సంప్రదించి, కర్నాటక ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేయవలసిందిగా అభ్యర్థించింది.
Also Read:Telugu Sangamam: కాశీలో తెలుగు భక్తుల సంగమం.. ప్రసంగించనున్న ప్రధాని
తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) నాయకుడు కమల్ హాసన్ గతంలో మద్దతు పలికారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా కమల్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో కమల్ సాయం తీసుకోవాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిపారు. కర్నాటక ఎన్నికలకు కేవలం 10 రోజుల సమయం ఉన్నందున, కాంగ్రెస్ మళ్లీ కమల్ హాసన్‌ను సంప్రదించినట్లు సమాచారం. కమల్ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నట్లు MNM వర్గాలు తెలిపాయి.
Also Read:Priyanka Gandhi: జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం
మే 10న ఎన్నికలు జరగనున్న 224 స్థానాలకు మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాలు మే 13న వెల్లడికానున్నాయి. మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, మరో 2 మంది అభ్యర్థులు ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో- 224 మంది బీజేపీ, 223 మంది కాంగ్రెస్ (మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీకి మద్దతు), 207 జేడీ(ఎస్), 209 ఆప్, 133 బీఎస్పీ, 4 సీపీఐ(ఎం), 8 జేడీ(యూ),2 ఎన్‌పీపీ పోటీ చేస్తున్నాయి. 685 మంది రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు (RUPP) చెందిన వారు కాగా, 918 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.