ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్‌లో ఉందని, అక్కడ స్వతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ వంటి వేడుకలు మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఉందని, ఇతర వేడుకలకు అనుమతి లేదని ముంబై కార్పోరేషన్ తిరస్కరించింది.
Read: పిల్లలు పుట్టరని ఆ ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదట…!!
దీంతో షాకైన కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసును దాఖలు చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను శివాజీ పార్క్‌లో నిర్వహించే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరింది. కేసులు ఫైల్ చేసిన వెంటనే నేతలు ఆ కేసులు వాపస్ తీసుకున్నారు. ఎందుకు వాపస్ తీసుకున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈనెల 28 న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా సోనియా గాంధీ, పార్టీ కీలక, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. భారీ స్థాయిలో సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సభపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
