తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి.
సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడ కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనక కుట్ర వుందన్నారు. మోడీ, కేసీఆర్ తెలంగాణ రైతుల జీవితాలతో రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మా కోసం కొట్లడుతున్నారు అని రైతుల మభ్యపెట్టేందుకు టీఆర్‌ఎస్ మంత్రులు డ్రామాలు ఆడుతున్నారన్నారు జగ్గారెడ్డి. ధాన్యం అమ్ముడుపోకుంటే.. తెలంగాణ రైతులు రోడ్ల మీద పడుకోకుండా ఏం చేస్తారో చెప్పండి అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.