NTV Telugu Site icon

Congress vs BJP: డికె శివకుమార్ నామినేషన్‌కు ఆమోదం.. కనకపురలో హైవోల్టేజీ పోటీ

Shiva Kumar Nomination

Shiva Kumar Nomination

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం ఆమోదించింది. ఆయనకు పోటీగా బిజెపికి చెందిన రెవెన్యూ మంత్రి ఆర్ అశోక రంగంలో దిగారు. ఇద్దరి మధ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కనకపుర నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ తన మద్దతుదారుల బలప్రదర్శన మధ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: Godhra Case: సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు.. 8 మంది దోషులకు బెయిల్

డీకె శివకుమార్ మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఆదాయపు పన్ను (ఐటి) డిపార్ట్‌మెంట్ విచారణలను ఎదుర్కొంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌ రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా గురువారం ఆయన సోదరుడు బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ కూడా అదే నియోజకవర్గానికి బ్యాకప్ అభ్యర్థిగా తన పత్రాలను దాఖలు చేశారు. అయితే, డికె శివకుమార్ నామినేషన్ ను ఈసీ ఆమోదించడంతో ఆయన పోటీలో ఉండడం ఖాయం అయింది. ఇక, బీజేపీ కనకపుర నుంచి మంత్రి ఆర్‌.అశోకను పోటీకి దింపింది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన అశోక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సన్నిహితుడిగా ఉన్నాడు.
Also Read:Srinagar Tulip Garden: కొత్త పర్యాటక రికార్డును సృష్టించిన శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌

కనకపుర నియోజవకర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2004 నుండి 2008 వరకు జనతాదళ్-సెక్యులర్ (జెడి-ఎస్) చేతిలో ఉన్న కొద్దికాలం మినహా 1989 నుండి కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. మే 10న జరగనున్న ఎన్నికల్లో కనకపురలో అత్యంత హైవోల్టేజీ పోటీ ఒకటిగా భావిస్తున్నారు. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.