NTV Telugu Site icon

హుజురాబాద్‌ ఉపఎన్నిక : కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏజెంట్ల ఆందోళన

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికు ఈ రోజు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. కరీంనగర్‌ లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళశాలలో ఈ కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. అయితే కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మమల్ని అనుమతించడం లేదంటూ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి వెల్లడంతో వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. అయితే 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి పోస్టల్‌ బ్యాలెట్లలో ఉన్న ఓట్లను లెక్కించనున్నారు.