NTV Telugu Site icon

Hyderabad: కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ పీఎస్లో చిన్నారుల ఫిర్యాదు..

Childrens

Childrens

వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ ‘మా ప్రాణాలకు భరోసా ఏది’ అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లల్ని, ఒక పెద్దాయనని వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులలో చలనం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతూనే ఉన్నా.. ఎన్సీఎల్ కాలనీలో మార్పులు జరిగాయి తప్ప ప్రయోజనం లేదు. పిల్లల్ని వీధి కుక్కలు పీక్కొని తినే పరిస్థితి వస్తుంది అని కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Junnu: అయ్యా బాబోయ్.. ‘జున్ను’ తింటే జరిగేది ఇదా..

బయట జరిగిన సంఘటన మన దగ్గర జరగదని అనుకోకూడదు. పిల్లలు ఎవరైనా పిల్లలే.. మన కళ్ళ ముందు మరొక సంఘటన జరగకముందే మేల్కొందాం అని భావించి బాధ్యత గల తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమం తమ ఒక్కరి కోసం కాదు అందరికోసం.. వీధి కుక్కల నుండి కాపాడండి అంటూ తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ అంటూ చిన్నారులు ప్లేకార్డులు చేతబూని స్టేషన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం

మరోవైపు.. రాష్ట్రంలో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత బుధవారం హుజురాబాద్లో దాదాపు 29 మందిపై దాడిచేసి కరిచాయి. వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ అనే కాదు హైదరబాద్ సహా అనేక ప్రదేశాలలో కుక్కలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ఘట్కేసర్ ప్రాంతంలో కూడా ఓ కుక్క 14 ఏళ్ల బాలుడిని వెంటాడింది. సంగారెడ్డిలో కూడా ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇదిలా ఉంటే.. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను హైకోర్టు అన్వేషించాలని సూచింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.