ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు శ్యామ్ రంగీలాకు సోమవారం జైపూర్‌లోని ప్రాంతీయ అటవీ అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసు అందజేసింది. జైపూర్ నగరంలోని ఝలానా చిరుతపులి రిజర్వ్‌లో నీల్‌గాయ్‌కు ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడవి పర్యటన సందర్భంగా నరేంద్రమోడీ దుస్తులను పోలిన వేషధారణలో శ్యామ్ రంగీలా కనిపించాడు. ప్రధాని మోడీ అడవి పర్యటన తరహాలో ఉన్న వేషధారణ వైరల్‌గా మారింది.
Also Read: Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం.. కన్నీటి పర్యంతమైన భార్య
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఇటీవల జంగిల్ సఫారీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన దుస్తులను పోలిన దుస్తుల్లోహాస్యనటుడు కనిపించాడు. మోడీ మాదిరిగా దుస్తులు,టోపీ, సన్ గ్లాసెస్, హాఫ్ స్లీవ్ జాకెట్ ధరించి శ్యామ్ కనిపించాడు. అయితే, జైపూర్‌లోని ఝలానాలో జంగిల్ సఫారీలో నీల్‌గాయ్‌కు ఆహారం ఇస్తూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినందున శ్యామ్‌కు నోటీసులు అందాయి.అతను సఫారీకి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 13న శ్యామ్ రంగీలా అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఝలానా చిరుతపులి రిజర్వ్ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు జైపూర్ ప్రాంతీయ అటవీ అధికారి జనేశ్వర్ చౌదరి తెలిపారు. వీడియోలో, శ్యామ్ తన కారు నుండి దిగి, తన చేతితో నీల్గాయ్‌కి ఆహారం తినిపిస్తున్నాడు.
Also Read:Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..
వన్యప్రాణులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం 1953, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం నింధనలు ఉల్లంఘించడమే. అడవి జంతువులకు ఆహారం ఇవ్వడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అంటువ్యాధులు సంభవిస్తాయి. వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంది. అలాగే, ఝలానా అడవిలో వన్యప్రాణులకు ఆహారం ఇవ్వడంపై నిషేధాన్ని సూచిస్తూ హెచ్చరిక, సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. శ్యామ్ రంగీలా వన్యప్రాణుల నేరానికి పాల్పడడమే కాకుండా, వీడియోను ప్రసారం చేయడం ద్వారా ఇతరులను నేరపూరిత చర్యలకు ప్రేరేపించాడని అటవీ శాఖ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై విచారణ తర్వాత ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారి చెప్పారు.