చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గం…
Read Also: ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?
అయితే, మేం ఏర్పాటు చేసిన ప్లెక్సీలు చింపేశారంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద రోజా వ్యతిరేకవర్గం ఆందోళనకు దిగింది… ఆర్కే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ధర్నా చేపట్టిన అమ్ములు సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే నగరిలో పలు సందర్భాల్లో అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.. స్థానిక ఎన్నికల సమయంలోనూ అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయి రచ్చచేసిన సంగతి తెలిసిందే.