NTV Telugu Site icon

CM KCR Tour: రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా?

Kcr Visit

Kcr Visit

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

Alsor Read:Allari Naresh: కామెడీ వైపు అల్లరి నరేష్.. కొత్త సినిమా ప్రారంభోత్సవం
ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నష్టం వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. జిల్లాలో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. వడగళ్ల వానకు ఆయా రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
Alsor Read: Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగింపు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని టీఎస్‌ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. దాదాపు 18,000 మంది బాధిత రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. జిల్లాలోని రామడుగు, చొప్పదండి మండలాల్లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను నివారించే అవకాశం లేదన్నారు.