NTV Telugu Site icon

ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ స‌మావేశం… 10 అంశాల‌పై చ‌ర్చ‌…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ప్ర‌ధాని మోడీతో ఢిల్లీలో స‌మావేశం అయ్యారు.  సుమారు 50నిమిషాల పాటు ఈ స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  ఇక ప్ర‌ధాని మోడికి 10 అంశాల‌తో కూడిన విన‌తుల‌ను అంద‌జేశారు.  తెలంగాణ‌లో ఐసీఎస్‌ల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు.  ప్ర‌స్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడ‌ర్ సంఖ్య‌ను 139 నుంచి 195 కి పెంచాలని కోరారు.  హైద‌రాబాద్‌-నాగ‌పూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాల‌ని కోరారు.  కొత్త‌గా ఏర్పాటైన జిల్లాల్లో న‌వోద‌య విద్యాల‌యాలను ఏర్పాటు చేయాల‌ని, ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్‌ను, ప్ర‌ధాని గ్రామీణ స‌డ‌క్ యోజ‌న కింద అద‌న‌పు నిధులు ఇవ్వాల‌ని, వామ‌ప‌క్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వాల‌ని కోరారు. అదేవిధంగా, క‌రీంన‌గ‌ర్‌లో ట్రిపుల్ ఐటీని మంజూరు చేయాల‌ని, హైద‌రాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాల‌ని కోరారు.  తెలంగాణ‌లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటును వీలైనంత త్వ‌ర‌గా ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడిని కోరారు.  

Read: రూపాయికే ఇడ్లీ… మూడు చెట్నీల‌తో స‌హా…ఎక్క‌డో తెలుసా..!!