కేసీఆర్ పెద్ద మనసు… అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామన్నారు. ఏడాదికి ధాన్యం ఎంత కొంటారో టార్గెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.
Read Also: మూడో స్థానంలో విజయవాడ… 13వ స్థానంలో హైదరాబాద్
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
మరోవైపు రైతు సంఘాల పోరాటం వల్లే ప్రధాని మోదీ దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల మీద పెట్టిన కేసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు . ఈ పోరాటంలో వందలాదిమంది ఆత్మార్పణం చేశారని.. ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని.. భారతప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ కోరారు. రైతు ఉద్యమం వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా ముందుకు సాగిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ హితవు పలికారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!