NTV Telugu Site icon

భ‌వానీపూర్ ఉప ఎన్నిక‌ల్లో టెన్ష‌న్‌…బీజేపీ, టీఎంసీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌…

భ‌వానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది.  ఈ ఎన్నిక‌ల్లో టీఎంసీ త‌ర‌పున ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తుండ‌గా, బీజేపీ నుంచి ప్రియాంక బ‌రిలో ఉన్నారు.  అయితే, ఇది ముఖ్య‌మంత్రి సిట్టింగ్ స్థానం కావ‌డంతో అమె విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయిన‌ప్ప‌టికీ, బీజేపీ గ‌ట్టి పోటి ఇవ్వ‌నుందని సర్వేలు చెప్పిన సంగ‌తి తెలిసిందే.  ఈ ఉప ఎన్నిక జ‌రిగే స‌మ‌యంలో బీజేపీ, టీఎంసీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  రెండు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు మ‌ధ్య జరిగిన ఘ‌ర్ష‌ణ‌లో అనేక మందికి గాయాల‌య్యాయి. బీజేపీ నేత క‌ళ్యాణ్ చౌబేర్ కారు ధ్వంసం అయింది.  దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి రెండు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టారు.  ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 53.32 శాతం ఓటింగ్ న‌మోదైన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.  

Read: పంజాబ్ రాజ‌కీయం: సిద్ధూ మ‌న‌సు మార్చుకున్నారా?