పంజాబ్ రాజ‌కీయం: సిద్ధూ మ‌న‌సు మార్చుకున్నారా?

పంజాబ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.  ఇప్ప‌టికే పంజాబ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేశారు.  త్వ‌ర‌లోనే కొత్త పార్టీని పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  కొత్త సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ సింగ్ స‌న్నీ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో మ‌రోసారి పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్ప‌డింది. నేత‌లు బుజ్జ‌గించినా ఆయ‌న విన‌లేదు.  రాజీనామాపై పున‌రాలోచ‌న లేద‌ని చెప్పిన సిద్ధూ స‌డెన్ గా ఈ రోజు ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ చ‌న్నీతో భేటీ అయ్యారు.  ఈ భేటీలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించారు.  సిద్ధూ పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతార‌ని, ఎమ్మెల్యే గుర్దీప్ సింగ్ పేర్కొన‌డంతో సిద్ధూ మ‌న‌సు మార్చుకున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఇక‌, సోమ‌వారం రోజున పంజాబ్ కేబినెట్ స‌మావేశం కాబోతున్న‌ది.  ఈ కేబినెట్‌లో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు నేత‌లు చెబుతున్నారు.  మ‌రో ఏడాది కాలంలో పంజాబ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో అధిష్టానం గుర్రుగా ఉన్న‌ట్టు స‌మాచారం.  

Read: కొడాలి నాని కీల‌క వ్యాఖ్య‌లు: ప‌వ‌న్ జీవితంలో వైసీపీని ఓడించ‌లేడు…

-Advertisement-పంజాబ్ రాజ‌కీయం:  సిద్ధూ మ‌న‌సు మార్చుకున్నారా?

Related Articles

Latest Articles