నార్త్ ఇండియా వెళ్లామంటే రోడ్డు పక్కన మసాలా వాసన, చోలే బచూర్ తినకుండా రాలేం. అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాలలో చోలే బచూర్ ఒకటిగా చెబుతారు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల్లో స్ట్రీట్ ఫుడ్స్ లో చోలే బచూర్ ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. అక్కడి భిన్న సంస్కృతుల మేళవింపు ఆహారవైవిధ్యంలోను కనిపిస్తుంది. చోలే బచూర్ (పూరీ, శెనగల కర్రీ), ఛాట్స్, బటర్ చికెన్, రజ్మాచావ్లా, పరోటా తినకుండా వెనక్కి రాలేము. రకరకాల రెసిపీలు రా రమ్మని పిలుస్తాయి. డాబాలు, రెస్టారెంట్లు, హైఎండ్ కేఫ్‌లు మన జిహ్వ చాపల్యాన్ని రెట్టింపు చేస్తాయి. మనదేశంలో స్ట్రీట్ ఫుడ్స్ లో చోలేబచూర్ రూ.70 నుంచి 80 రూపాయలు వుంటుంది. కానీ స్వీడన్‌లో దీని కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు షాకవుతారు. అక్షరాలా వెయ్యి రూపాయలు. ఓన్లీ.
ఓ నెటిజన్ చోలే బచూర్ స్వీడన్‌లో కాస్ట్ ఎంతో చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ కి చెందిన వ్యక్తి స్టాక్ హోంలోని భారతీయ రెస్టారెంట్‌లో చోలే బచూర్ ఆర్డర్ చేశాడు. దీనికి అక్కడి రెస్టారెంట్ వారు వేసిన బిల్ 1000 రూపాయలు. మనదేశంలో ఈ ఫ్యామస్ స్ట్రీట్ ఫుడ్ హోటల్స్ లో అయితే 300 రూపాయలకు మించదు. ఎయిర్ పోర్ట్ లు, రైల్వే స్టేషన్లలో దీని ఖరీదు కాస్త ఎక్కువే. కానీ స్టాక్ హోంలో అంత కాదు. స్టాక్ హోంలో భారతీయ రుచులకు మొహం వాచిపోయిన ఓ వ్యక్తి చోలే బచూర్ ఆర్డర్ చేశాడు. అంతే ఘుమఘమలాడుతూ బ్రెడ్ తో పాటు చోలే బచూర్ టేబుల్ మీద వచ్చి వాలింది.
”లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్వీడన్ లోని స్టాక్ హోమ్ లోని ఒక భారతీయ రెస్టారెంట్ లో నాకు వడ్డించిన చోలే భాచర్ ఇక్కడ ఉంది. నేను ఇంటిని మిస్ అవుతున్నాను.” అని క్యాప్సన్ రాశాడు సదరు వ్యక్తి. అయితే ఈ చోలే బచూర్ ఫోటోని చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొ౦దరు దాన్ని ‘అసహ్యకరమైనది’ అని పిలిచారు, మరికొ౦దరు ‘ఊచకోత’, ‘హేయ౦’, ‘దారుణమైనది’ వ౦టి విషయాలు ఉన్నాయి. “ఎవరో కచోరి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది, కానీ దానిని చుట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఇది సిగ్గుపడే చోలే భాచర్,” అని మరొకరు రాశారు.