NTV Telugu Site icon

Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

Chilli Chai

Chilli Chai

భారతదేశం అంతటా అత్యంత సర్వసాధారణమైన పానీయాలలో చాయ్ ఒకటి. సంపన్నుల నుంచీ అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. మీరు బంధువు లేదా స్నేహితుడి ఇంటికి వెళ్లిన వెంటనే కప్పు టీ ఇస్తారు. మీకు కొన్ని నమ్‌కీన్ లేదా స్నాక్స్‌తో కూడిన ఒక కప్పు టీ అందిస్తారు. ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేశాయి. లెక్కలేనన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. సాధారణంగా, చాయ్ టీ ఆకులు, మొత్తం మసాలాలు, పాలు, చక్కెరతో తయారుచేస్తారు. అయితే, ఎర్ర మిరపకాయలతో చేసిన టీని ఎవరైనా మీకు అందిస్తే, మీరు దానిని జీర్ణించుకోగలరా?. మీరు అసహ్యించుకునే వ్యక్తులకు అందించడానికి అనువైన టీ రెసిపీని నేర్చుకోవాలట. ఓ నెటిజన్ చిల్లీ చాయ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read:American Consulate: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సెలేట్.. ఇక వీసా మరింత ఈజీ
పెళ్లి వయసు వచ్చాక ఇంట్లో పెళ్లి గొల ఎక్కువ కావడం సహజం. అయితే, పెళ్లి అయితే కుటుంబం అనే పంజరంలో చిక్కుకొని, స్వేఛ్చను కోల్పోతామని నేటి యువత ఆలోచిస్తోంది. అందుకే పెళ్లి అని మాట ఎత్తితే రెండు చేతులతో నమస్కరించి తమ ఎంజాయ్ ను తాము చేసుకోనివ్వండి. ఈ పెళ్లి మాట ఎత్తకండి మహాప్రభో అంటూ కుటుంబ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. పెళ్లి గొల నుంచి తప్పించుకునేందుకు చిలిపిలో భాగంగా ‘చిల్లీ చాయ్’ తయారు చేస్తున్నారు.

Also Read:Bandi Sanjay: మరో ఆందోళనకు సిద్ధం.. ఈనెల 25న నిరుద్యోగ మహాధర్నా

చాయ్‌లో టీ ఆకులు లేదా సుగంధ ద్రవ్యాలు వేసే బదులు, ఎర్ర మిరపకాయలతో నిండిన పాత్రలో పాలు పోసి ఉడికించారు. దీని నుంచి వచ్చే ద్రవం కొంచెం చాయ్ లాగా కనిపిస్తుంది. అయితే ఇది మిరపకాయలతో తయారు చేయబడినందున చాలా రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది. దీన్ని బంధువులు, స్నేహితులకు చిలిపిగా ఉపయోగించాలని ఓ ట్వీట్టర్ యూజర్ సూచించారు. “మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగే ఆంటీలందరికీ దీన్ని అందించండి” అని ట్వీట్‌లో రాశారు. కాగా, స్పైసీ చాయ్ యొక్క వైరల్ వీడియోపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు స్పందించారు. దీనికి 500k పైగా వ్యూస్, వేలాది స్పందనలు, కామెంట్‌లు వచ్చాయి.