NTV Telugu Site icon

ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ పేదల మెడకు ఉరితాడులా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉచిత రిజిస్ట్రేషన్‌లు కోరుతూ ఈ నెల 20, 23న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కక్ష సాధింపు కోసమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు.

ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల వద్ద ధాన్యం కొనేవారు కరువయ్యారని ఆయన అన్నారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయిస్తుండటంతో బస్తాకు రూ.500 వరకు నష్టం వస్తోందని ఆయన అన్నారు. రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. ప్రైవేట్‌ లేఅవుట్లలో 5శాతం భూమి మధ్య తరగతికి పెనుభారమని ఆయన పేర్కొన్నారు.