ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని తరలించడానికి వ్యూహం ఏంటి..? అనే దానిపై ప్రధాని మోడీ.. విపక్షాలకు వివరించే అవకాశం ఉంది.
26న విపక్షాలతో కేంద్రం భేటీ.. విషయం ఇదే..!
