తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టన్ కుప్పకూలింది. ప్రమాదం సమయంలో సీడీయస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణీతో పాటు మరో 7గురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్ర కేబినేట్ ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
కాసేపట్లో ఈ ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ అచూకీ మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఘటన స్థలం వద్ద రెస్కూ సిబ్బంది ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించింది. అంతేకాకుండా తీవ్రంగా గాయపడిని మరో 3గురిని ఆసుపత్రికి తరలించింది.
