షమా సికందర్… ఈ పేరు తెలియని బాలీవుడ్ ప్రియులు ఉండరు. అయితే, ఆమె సినిమాల్లో సంచలనాలు సృష్టించలేదు. ప్రధానంగా టీవీ సిరియల్స్, షోస్ చేస్తుంటుంది. కానీ, తన హాట్ ఫోటోషూట్స్ తో సొషల్ మీడియాలో రెగ్యులర్ గా దుమారం రేపుతుంది. అదే ఆమె పాప్యులారిటి సీక్రెట్!
ఆగస్ట్ 4న బర్త్ డే జరుపుకున్న హాట్ గాళ్ షమా వయస్సెంతో తెలుసా? 40 ఏళ్లు! 30 దాటి 40 లోకి వచ్చేసినా కూడా ఆమె అందం తగ్గకపోవటం, పైగా మరింత మెరుగవటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటుంది. రెగ్యులర్ వర్కవుట్స్ వల్లే ఫిట్ నెస్ అండ్ బ్యూటీ సాధ్యమని చెబుతుంది సెక్సీ క్వీన్. అయితే, షమా కొన్ని కాస్మోటిక్ ప్రొసీజర్స్ సాయం తీసుకుని అందాన్ని మెరుగులు దిద్దుకున్నానని కూడా ధైర్యంగా ఒప్పుకుంటుంది. కాస్మోటిక్ సర్జరీలు మాత్రం చేయించుకోలేదట.
‘యే మేరీ లైఫ్ హై’ డైలీ సీరియల్ తో అందరి దృష్టినీ తొలిసారి ఆకట్టుకుంది షమా సికందర్. అప్పట్లో ఆమె మిడిల్ క్లాస్ సింపుల్ అండ్ స్వీట్ టీనేజ్ గాళ్ గా అలరించింది. కానీ, అప్పటికి ఇప్పటికీ పోల్చి చూస్తే షమాని ఎవ్వరూ పోల్చుకోలేరు కూడా! ఓవర్ ద ఇయర్స్ అంతలా మారిపోయింది సెక్సీ సైరన్!
‘మన్ మే హై విశ్వాస్, సీఐడీ, బాల్ వీర్’ లాంటి టెలివిజన్ షోస్ లో షమాకు మంచి గుర్తింపు దక్కింది. సొషల్ మీడియాలో కూడా ఆమె హైపర్ యాక్టివ్. రెగ్యులర్ గా తన సూపర్ ఫిట్ ఫిజిక్ తో విజువల్ ట్రీట్స్ అందిస్తూ ఉంటుంది!