NTV Telugu Site icon

Viveka case: సీబీఐ ముందుకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి.. విచారణపై సర్వత్ర ఉత్కంఠ

Ys Bhaskar Reddy

Ys Bhaskar Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సీబీఐ విచారించనుంది. కడప సెంట్రల్‌ జైలులోని అతిథిగృహంలో వివేకా హత్య గురించి సీబీఐ బృందం భాస్కర్‌రెడ్డిని విచారించనుంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాల చెరిపివేత, రూ.40 కోట్ల డీల్‌పై తండ్రీకొడుకులు భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ వాదిస్తోంది.

Also Read:Rain Forecast: ఎండల నుంచి ఉపశమనం.. ఏపీకి వర్ష సూచన

భాస్కర్‌రెడ్డిని గత నెల 23న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది సిబిఐ. అయితే, వ్యక్తిగత పనులున్నాయని రాలేనని భాస్కర్ రెడ్డి తెలిపారు. \ఈ నేపథ్యంలో నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఆదివారం విచారణకు హాజరవుతున్నారు. సిబిఐ విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Also Read:Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

మరోవైపు వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎంపీ అవినాశ్‌రెడ్డిని మూడుసార్లు సీబీఐ విచారించింది. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న, మూడోసారి మార్చి 10న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ.. అవినాష్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపైనా హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరిస్తున్నాడని అతని తరపు లాయర్ వివరించారు.
సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Show comments