NTV Telugu Site icon

ఒమిక్రాన్‌తో జాగ్రత్త.. 2-3 రోజుల్లో రెట్టింపు అయ్యే అవకాశం : డబ్ల్యూహెచ్‌వో

గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ సోకిన దేశాల్ల విజృంభిస్తోంది. ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్‌ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది.

అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్ శరవేగంగా విజృంభిస్తోందని, ఇప్పటికే యూకే, యూఎస్‌ దేశాలలో ఒమిక్రాన్‌ మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది. అయితే డిసెంబర్‌ 20 నుంచి 26 వరకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని, అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌పై జాగ్రత్త వహించాలని దేశాలకు సూచించనట్లు తెలిపింది. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ దాని ప్రభావాన్ని చూపుతోంది. నిన్న ఒక్క రోజే 127 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు తాజాగా 9వేలకు పైగా నమోదయ్యాయి.