Site icon NTV Telugu

సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

Sai Dharam Tej restarts dubbing for "Republic" Movie

‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

అయితే బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుండి అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే అపోలో వైద్యులు అర్థరాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ కు సిటీ స్కాన్ తో పాటు పలు టెస్ట్ లు పూర్తి చేశారు. అందులో షోల్డర్ బొన్ విరిగినట్టు, ఇప్పటికి ఇన్ సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డామేజ్ ఏమి లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద, ఐపీసీ ఐపిసి 3, 36, 184 ఎంవి యాక్ట్ ప్రకారం కేసు నమోదైనట్టు సమాచారం. మొత్తానికి అతివేగం వల్లే రోడ్డు ప్రమాదం జరిగింది.

Exit mobile version