Site icon NTV Telugu

అత్యవసర చికిత్స.. దుబాయ్‌కి కెప్టెన్ విజయ్‌కాంత్..

కోలీవుడ్ సీనియర్‌ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యపరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇవాళ అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్‌కాంత్.. కుమారుడుతో కలసి చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టు నుండి దుబాయ్‌ ప్రయాణం అయ్యారని చెబుతున్నారు.. ఇక, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుండి అమెరికాకు కూడా తీసుకెళ్తారని సమాచారం.. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్.. గత ఏడాది ఆయన కరోనా మహమ్మారి బారినపడ్డారు.. ఆ తర్వాత చికిత్స తీసుకుని సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆ తర్వాత మళ్లీ ఆయనను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. దీంతో.. ఇప్పుడు దుబాయ్‌కు తీసుకెళ్లారు.

Exit mobile version