NTV Telugu Site icon

BRS: మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగసభ.. కేసీఆర్ టార్గెట్ అదే

Kcr 1

Kcr 1

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయలను శాసించేందుకు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్..దూకుడుగా తమ రాజకీయ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని భావిస్తున్న సీఎం కేసీఆర్..తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన చాలా మంది నేతలు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహరాష్ట్ర, కర్నాటకలో ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ బహిరంగసభలకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం దేశంలో గుణాత్మక మార్పే ధేయంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చి పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు.
Also Read: Unique Wedding Ceremony: శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి!

మహరాష్ట్రలో బీఆర్ఎస్‌ మరో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 26న కాందార్‌ లోహలో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మహారాష్ట్రలో నిర్వహించబోయే రెండో సభలో భారీగా చేరికలు ఉండబోతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర నేతలు కేసీఆర్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్‌ తొలి బహిరంగ సభ నిర్వహించింది. 26న నిర్వహించబోయే రెండో బహిరంగసభకు సంబంధించి మహారాష్ట్ర నేతలు శంకరన్న డోండ్గే, దత్తాపవార్ కేసీఆర్‌తో సమాలోచనలు చేశారు. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కీలక నేతలు బీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Inter Exams : నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే

మార్చి 26న మహారాష్ట్రలోని కందర్ లోహాలో జరిగే బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సందర్భంగా మహారాష్ట్ర సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్‌సీపీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు శంకరన్న దోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్‌ ఘిసేవాడ్‌ (భోకర్‌ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అశోక్‌ చౌహాన్‌పై కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు), ఎన్‌సీపీ నాందేడ్‌ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్‌, మహారాష్ట్ర ఎన్సీపీ యూత్ సెక్రటరీ శివరాజ్ దోంగే, ఎన్సీపీ నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపీ అధికార ప్రతినిధి డా. సునీల్ పాటిల్, ఎన్సీపీ లోహా అధ్యక్షుడు సుభాష్ వాకోర్, ఎన్సీపీ కందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు, న్యాయవాది విజయ్ ధోండాగే. హన్మంత్. కళ్యాణ్‌కర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వప్నిల్ ఖేరే తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ను కలిశారు.

Show comments