NTV Telugu Site icon

Bro OTT: ‘బ్రో’ మూవీ ఏ ఓటిటి లో రిలీజ్ అవుతుందో తెలుసా?

Bro (3)

Bro (3)

తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది.. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు.

తమిళంలో వినోదయ సీతం చిత్రాన్ని సముద్రఖని నటించి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అనేక మార్పులతో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని మార్చారు. పవన్ ఫాన్స్ అలీ అలరించే అంశాలు ఉంటూనే ఎమోషన్స్ ప్రధానాంగా హైలైట్ అయ్యేలా ఈ చిత్రం ఉందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.. ఇకపోతే ప్రతి సినిమాలాగే ఈ సినిమాకు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ బ్రో చిత్రాన్ని భారీ ధర వెచ్చించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఐదు వారాల తర్వాత బ్రో మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుందంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు కానీ.. జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న బ్రో చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి… ప్రస్తుతం అయితే థియేటర్స్ లో హంగామా సాగుతోంది. మరణించిన వ్యక్తికి కాల దేవుడు ప్రత్యక్షమై మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, డైలాగ్స్, సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..