వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు.. షరతులు కూడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది.
కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్న వరవరరావుకు అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ముంబైలోనే ఉండాలంటూ షరతులు విధించింది.. ఈ నేపథ్యంలో, తెలంగాణలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. తాను ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు కోర్టు విధించిన షరతులన్నింటినీ తాను పాటించానని, ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని తెలిపారు.. ప్రస్తుతం తన వయసు 84 ఏళ్లని, తన భార్య వయసు 72 ఏళ్లని… కోర్టు ఆదేశాల మేరకు తామిద్దరం ఇంటికి దూరంగా ముంబైలోనే ఉంటున్నామంటూ కోర్టుకు తెలిపిన ఆయన.. ముంబైలాంటి మహానగరంలో వైద్య చికిత్సలు చేయించుకోవడం తనలాంటి వాళ్లకు తలకుమించిన భారంగా ఉంటుందని.. తనకు తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.. కానీ, ఇవాళ పాత షరతులనే కొనసాగిస్తూ ఆదేశాలిచ్చింది బాంబే హైకోర్టు.
Also Read
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!