Site icon NTV Telugu

బ్రేకింగ్:ఫిలింనగర్లో బోల్తా కొట్టిన బీఎండబ్ల్యూ కారు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అదుపు త‌ప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వ‌ద్ద ఉన్న మూల‌మ‌లుపు వ‌ద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింన‌గ‌ర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు.

రామానాయుడు స్టూడియో వ‌ద్ద ఉన్న మూల‌మ‌లుపు వ‌ద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మ‌ధ్యలో ఉన్న డివైడ‌ర్‌ను ఢీ కొంది ఆ కారు. దీంతో కారులోని నాలుగు బెలూన్లు తెరుచుకోవడంతో తప్పింది ముప్పు. కారు న‌డుపుతున్న అర్మన్‌కు గాయాలు కాగా అత‌న్ని స్థానికులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇదిలా ఉండ‌గా కారు మూడు రోజుల కింద‌టే కొనుగోలు చేసిన‌ట్లు గుర్తించారు. కేవ‌లం 947 కిలోమీట‌ర్ల దూర‌మే ఈ కారు తిరిగింది. ప్రమాదం నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

Exit mobile version