ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు.
అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ ర్యాలీ యధావిధంగా జరుగుతుందని బీజేపీ శ్రేణులు ఉద్ఘాటించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ర్యాలీ నిర్వహించకుండానే నడ్డా ఈ విధంగా బీజేపీ నిరసన కార్యక్రమం ముగించేశారు. అయితే అనంతరం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
