Site icon NTV Telugu

కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్‌కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్‌రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పు చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తుందని మాత్రమే బండి సంజయ్ అన్నారని పేర్కొన్నారు.

Read Also: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

తెలంగాణలో బీజేపీ బలపడుతుందని.. బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిందని.. అందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి తమతో పనులు చేయించుకోవడం.. ఇక్కడకు వచ్చి తమపై ఆరోపణలు చేసి గొడవలు పెట్టుకోవడం కేసీఆర్‌కు తగదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరని రఘునందన్‌రావు నిలదీశారు. పెంచిన ధరలలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా అని సూటిగా ప్రశ్నించారు.

Exit mobile version