Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp Leader Etela Rajender Wins Huzurabad Assembly Seat In By Poll

ఈటల రాజకీయ ప్రస్థానం.. అపజయం ఎరుగని నేత.. ఏడు విజయాలు ఇలా..

Published Date :November 2, 2021 , 9:07 pm
By Sudhakar Ravula
ఈటల రాజకీయ ప్రస్థానం.. అపజయం ఎరుగని నేత.. ఏడు విజయాలు ఇలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్‌ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే, వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఆయన.. ఎవరిపై సాధించారు.. ఎంత మెజార్టీ దక్కిందనేది ఓసారి పరిశీలిద్దాం..

2004లో తొలిసారిగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈటల.. ఆయనకు 68,393 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డికి 48,774 ఓట్లు వచ్చాయి.. దీంతో.. ఈటలకు 19,619 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక, 2008లో మరోసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనకు 54,092 ఓట్లు వచ్చాయి.. ఈ సారి ముద్దసాని దామోదర్ రెడ్డికి 31,808 ఓట్లు రావడంతో.. ఈటల మెజార్టీ 22,284కి పెరిగింది. ఇక, తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో ఉప ఎన్నికల్లో పోటీచేయగా 56,752 ఓట్లు వచ్చాయి.. ఆయనపై పోటీచేసిన కృష్ణమోహన్ వకులాభరణంకు 41,717 ఓట్లు పోల్‌ అయ్యాయి.. అప్పుడు 15,035 ఓట్ల మెజార్టీ దక్కింది.

ఇక, 2010 ఉప ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు 93,026 ఓట్లు రాగా.. ముద్దసానికి 13,799 ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఈ ఎన్నికల్లో 79,227 ఓట్ల భారీ మెజార్టీతో విజయం ఢంకా మోగించారు ఈటల.. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 95,315 ఓట్లు సాధించారు.. ఆయన సమీప ప్రత్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డికి 38278 ఓట్లు రాగా.. ఈటలకు 57,037 ఓట్ల మెజార్టీ దక్కింది. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఈటలకు 1,04,840 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు సాధించారు.. ఈ సారి ఈటల మెజార్టీ 43,719గా ఉంది. ఇక, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సారి జరిగిన ఉప ఎన్నికల్లో.. ఈటెల రాజేందర్‌కు 1,06,213 ఓట్లు పోలయ్యాయి.. అధికార పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,348 ఓట్లు రాగా.. ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా.. వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు ఈటల.. పార్టీ మారినా.. తనపై ప్రజల్లో అభిమానం మాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలతో రుజువు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP candidate Etela Rajender won
  • Etela Rajender
  • Etela Rajender won
  • Huzurabad Assembly

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions