అయోధ్య బరిలో సీఎం యోగి… గెలుపు కోసం వ్యూహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మళ్ళీ అధికారమే పరమావధిగా అడుగులు వేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయనున్నారా..? ఇంతకూ యోగీని అయోధ్యనుంచే పోటీకి దించాలని బీజేపీ నేతలు ఎందుకు భావిస్తున్నారు…? యోగీ, అయోధ్య స్థానానికి మారడం.. సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.?అనేది యావత్ భారతాన చర్చనీయాంశంగా మారింది.
యూపీ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు బీజేపీ అన్ని వ్యూహాల్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అయోధ్య నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యోగి అయోధ్య అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగితే, అది పార్టీకి పూర్తి సానుకూలంగా పరిణమిస్తుందని నేతలు భావిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య బరిలో నిలపాలన్న బీజేపీ వ్యూహం వెనుక ఐదు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. రామాలయ నిర్మాణం, యోగీపై హిందుత్వ నేతగా ముద్ర, అవధ్‌పై ప్రభావం, ఓటర్లకు స్పష్టమైన సందేశం, అయోధ్య బీజేపీకి అత్యంత ముఖ్యమైనదన్న సంకేతాన్ని జనంలోకి పంపించడంగా తెలుస్తోంది.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
దాదాపు 500 ఏళ్ళనాటి సమస్యకు సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. తర్వాత రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీంతో రాజకీయంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. సంఘ్ పరివార్‌కు ఇది కేంద్ర స్థానం కావడం కూడా మరొక కారణం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ్‌నాథ్ పీఠానికి, అయోధ్యకు అవినాభావ సంబంధం ఉంది. యోగి ఆదిత్యనాథ్ గురువులు మహంత్ అవైద్యనాథ్, మహంత్ దిగ్విజయనాథ్ తమ తమ కాలాల్లో రామాలయం ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1949లో రామ జన్మభూమి ఉద్యమంలో మహంత్ దిగ్విజయనాథ్ ప్రముఖ పాత్ర పోషించారు.
యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీ చేయించడం వల్ల బీజేపీ హిందుత్వ భావజాలం మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా బీజేపీ హిందుత్వ నేతగా ఆయనకు మరింత ఎక్కువ గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతంలో అయోధ్య ఉంది. ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టు ఉంది. అయోధ్య నుంచి యోగి పోటీ చేస్తే ఈ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పార్టీ లాభపడుతుందని బీజేపీ భావిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పవిత్ర పుణ్య క్షేత్రం వారణాసి నుంచి పోటీ చేసి, గొప్ప అనుబంధాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా యోగి కూడా అయోధ్య నుంచి పోటీ చేస్తే, ఆ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధాన్ని చాటవచ్చు. అయోధ్య నియోజకవర్గం బీజేపీకి చాలా ముఖ్యమైన స్థానం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయోధ్యపై యోగి ప్రత్యేక దృష్టి సారించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. రోడ్ల విస్తరణ, స్నాన ఘట్టాల సుందరీకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అయోధ్యను ఎంచుకోవడం వెనుక పక్కా వ్యూహం వుందంటున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?