బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్ మూడో స్థానంలో, సిరి నాలుగో స్థానంలో, కాజల్ ఐదో స్థానంలో ఉన్నారని టాక్ నడుస్తోంది.
Read Also: బాలీవుడ్ లోకి ‘అఖండ’.. హీరో అతడే..?
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఈ నేపథ్యంలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. ఆ వారం జెస్సీకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కాజల్ సేవ్ అయ్యింది. ఆ తర్వాత రవి ఎలిమినేట్ అయిన వీక్‌లో కూడా కాజల్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆ వారం కాజల్ తన స్నేహితుడు సన్నీ ఇచ్చిన ఎవిక్షన్ పాస్‌తో బతికిపోయింది. అయితే అనూహ్యంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం శ్రీరామ్‌తో గొడవ.. సన్నీతో గిల్లికజ్జాలు కాజల్ ఆటతీరుపై ప్రభావం చూపించాయని.. అందుకే ఆమెకు ఓట్లు తక్కువగా పడ్డాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే హానెస్ట్‌గా గేమ్ ఆడుతున్న కాజల్‌ను కాకుండా.. హగ్‌లతో విసిగిస్తున్న షణ్ముఖ్, సిరిలలో ఒకరిని ఈ వారం ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వారం అనూహ్య పరిణామాలు ఏవైనా చోటు చేసుకుంటాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!