NTV Telugu Site icon

బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్‌లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్ మూడో స్థానంలో, సిరి నాలుగో స్థానంలో, కాజల్ ఐదో స్థానంలో ఉన్నారని టాక్ నడుస్తోంది.

Read Also: బాలీవుడ్ లోకి ‘అఖండ’.. హీరో అతడే..?

ఈ నేపథ్యంలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. ఆ వారం జెస్సీకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కాజల్ సేవ్ అయ్యింది. ఆ తర్వాత రవి ఎలిమినేట్ అయిన వీక్‌లో కూడా కాజల్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆ వారం కాజల్ తన స్నేహితుడు సన్నీ ఇచ్చిన ఎవిక్షన్ పాస్‌తో బతికిపోయింది. అయితే అనూహ్యంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం శ్రీరామ్‌తో గొడవ.. సన్నీతో గిల్లికజ్జాలు కాజల్‌ ఆటతీరుపై ప్రభావం చూపించాయని.. అందుకే ఆమెకు ఓట్లు తక్కువగా పడ్డాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే హానెస్ట్‌గా గేమ్ ఆడుతున్న కాజల్‌ను కాకుండా.. హగ్‌లతో విసిగిస్తున్న షణ్ముఖ్, సిరిలలో ఒకరిని ఈ వారం ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వారం అనూహ్య పరిణామాలు ఏవైనా చోటు చేసుకుంటాయేమో చూడాలి.