Site icon NTV Telugu

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మొదట మావోయిస్టులే తమపై కాల్పులకు పాల్పడ్డారని… దాంతో తాము ఎదురుకాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version