బసవతారకం ఆస్పత్రిలో 21 బెడ్స్‌తో డే కేర్ వార్డ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందించడంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బసవతారకం ఆసుపత్రిలో ఇవాళ 21 బెడ్స్ తో ఒక అధునాతన డేకేర్ వార్డ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మొదలైన ఈ ప్రస్థానం ఈ రోజు 650 పడకలుగా అభివృద్ధి చెందడం… అనేక అధునాతన సౌకర్యాలను సమకూర్చుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం చాలా బాధాకరమైన విషయం, నాణ్యమైన క్యాన్సర్ చికిత్స ను వారికి అందుబాటులోకి తీసుకురావడం… అవసరమైన అత్యాధునిక సదుపాయాలు కల్పించడం… అతి తక్కువ ఖర్చుతో లాభాపేక్ష లేకుండా సేవ చేయడం మా ఆసుపత్రి యొక్క లక్ష్యం అన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ రోగుల దృష్ట్యా ఆసుపత్రిని విస్తరిస్తున్నాం అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రోగికి వారి ఆర్ధిక స్థోమతతో సంబంధం లేకుండా చికిత్సను అందించడం ఆసుపత్రి యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. తాము చేస్తున్న ఈ నాణ్యమైన సేవలను గుర్తిస్తూ ది వీక్ హన్సా మ్యాగజైన్ సర్వే చేసి భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రులలో ఒకటిగా టాప్ 6వ ర్యాంక్ ఇచ్చిందన్నారు.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?

గత 5 సంవత్సరాలుగా ఈ స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ర్యాంక్ సాధించిన ఏకైక ఆసుపత్రి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అని చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇటీవల నీతి ఆయోగ్ ఆసుపత్రిని స్టడీ చేసి భారతదేశం లోనే అత్యుత్తమ లాభాపేక్షలేని ట్రస్ట్ హాస్పటల్ గా గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ఆసుపత్రిల యొక్క మోడల్స్ ని స్టడీ చేయడంకోసం ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్యానెల్ లో మెంబెర్ గా సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర రావు గారిని ప్రతిపాదించడం జరిగిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విదంగా ఎన్నో అవార్డులు మరియు ఎన్నో ఘనతలు సాధిస్తున్న మన ఆసుపత్రికి చైర్మన్ గా ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించడంలో ఎంతో మంది కృషి దాగి వుంది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా ఒక్క డాక్టర్ కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ ఎలాంటి భయానికి లోనుకాకుండా ఎంతో నిబద్దతతో క్యాన్సర్ రోగులకు చికిత్సను అందిస్తున్నారు, మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలు అన్నారు నందమూరి బాలకృష్ణ.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!