Site icon NTV Telugu

‘మా’ఎన్నికలు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు.

తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని బాలకృష్ణ ప్రశ్నించారు. మా బిల్డింగ్ కోసం అడిగితే ఒక్క ఎకరం భూమిని కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు. గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ.. ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకుని విమానాల్లో తిరాగారని.. ఆ డబ్బులు.. ఏం చేశారని బాలయ్య నిలదీశారు.

‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించిన బాలయ్య.. విష్ణుకు సహకరిస్తానని తెలిపారు. అంతేకాదు అందరం కలిస్తే ‘మా’ కోసం ఇంద్రభవనం లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు.

Exit mobile version