టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణాజలాలపై పోరుకు సిద్ధమయ్యారు. సీమకు కృష్ణాజలాలు తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నది. ప్రభుత్వాలు మారినా, రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నా సీమకు జలాల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కృష్ణా రివర్ వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్లిపోవడంతో సీమకు నీళ్లు వచ్చే అంశంపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సీమకు కృష్ణా జలాలు, హక్కులు, డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ రౌంట్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 8 పార్లమెంట్ నియోజక వర్గాలకు చెందిన టీడీపీ నేతలతో బాలయ్య సమావేశం అయ్యారు. కృష్ణా జలాల విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి అనే అంశంపై చర్చించారు.
Read: కరీంనగర్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మాకాలు…