యూఏఈ లోని ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ తీసుకొని పాక్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఎందుకంటే యూఏఈలో మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండానే రెండు జట్లు వస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు గెలిస్తే వారే ఫైనల్ కు చేరుకొని అక్కడ టైటిల్ కోసం న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడుతారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోని జట్టుగా ఉన్న పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందా… లేదా ఆసీస్ పాక్ కు ఈ కీలక మ్యాచ్ లో షాక్ ఇస్తుందా అనేది చూడాలి.
ఆసీస్ : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(c), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(wk), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
పాక్ : మహ్మద్ రిజ్వాన్(wk), బాబర్ ఆజం(c), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది