Site icon NTV Telugu

IND VS AUS: ఆలౌట్ అయిన ఆసీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..

Odi

Odi

చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి 3వ వన్డేలో భారత్‌కు 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ 33, మిచెల్ మార్ష్‌ 47 రన్స్ చేశారు. ఇక, కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ డకౌటయ్యాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్‌దీప్‌ పాండ్య చెరో మూడు వికెట్లను పడగొట్టారు. అక్షర్‌ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
Also Read:Green Corridor: జాతీయ రహదారులపై హెచ్ఎండిఏ పూలబాటలు

చెన్నైలోని చెపాక్కంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ ప్లేయర్లుగా ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ రంగంలోకి దిగారు. జట్టు స్కోరు 68 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ 33 పరుగుల వద్ద ఔటయ్యాడు. 1 సిక్స్, 8 ఫోర్లతో 47 పరుగులు జోడించిన మిచెల్ మార్ష్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. తదుపరి కెప్టెన్ స్టీవ్ స్మిత్ పరుగులేమీ చేయకపోగా, డేవిడ్ వార్నర్ 23 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 28 పరుగులు చేశారు.

Also Read:CM KCR Tour: రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా?
కాసేపటికి బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ అలెక్స్ కారీ 38 పరుగులు జోడించాడు. దూకుడుగా పరుగులు తీయడంలో పేరుగాంచిన మార్కస్ స్టోయినిస్ 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన సీన్ అబాట్ 26 పరుగులు, అష్టన్ అగర్ 17 పరుగులు చేశారు. మిచెల్ స్టార్క్, ఆడమ్ చంపా 10 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 270 పరుగులు చేస్తే గెలుపే లక్ష్యంగా భారత జట్టు రంగంలోకి దిగింది. ఇప్పటికే జరిగిన 2 వన్డేల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి టైగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

Exit mobile version