Site icon NTV Telugu

బ్యాంకు ఖాతాదారులకు మరో షాక్… జనవరి 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు

కొత్త సంవత్సరం నుంచి బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. 2022, జ‌న‌వ‌రి 1 నుంచి ఏటీఎం సెంటర్లలో అపరిమిత లావాదేవీలు జరిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అప‌రిమిత లావాదేవీల‌పై రుసుములు పెంచుతున్నట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల ప‌రిమితి దాటితే.. ఎక్కువ రుసుములు వ‌సూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి ఫైన్ వ‌సూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకుల‌కు ఆర్‌బీఐ అనుమ‌తి ఇచ్చింది.

Read Also: స్థిరంగా బంగారం.. భారీగా పెరిగిన వెండి ధ‌ర‌లు

ప్రతినెలా సొంత బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో ఐదు లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే మూడు లావాదేవీలు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. దాని పరిమితి దాటితే ఒక్కో ట్రాన్‌జాక్షన్‌కు రూ.21 చొప్పున బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ ఛార్జీతో పాటు అదనంగా బ్యాంకులు ట్యాక్సులు వసూలు చేస్తాయి. ఈ విషయంపై ఇప్పటికే యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలు తమ కస్టమర్లకు సందేశాలు పంపి అప్రమత్తం చేస్తున్నాయి. కాగా గతంలో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే రూ.15 లేదా రూ.20 మాత్రమే బ్యాంకులు వసూలు చేసేవి. ఇప్పుడు ఆర్‌బీఐ అనుమతి ప్రకారం.. రూ.21కి మంచి ఎక్కువ ఛార్జీలను బ్యాంకులు వసూలు చేయనున్నాయి.

Exit mobile version