Site icon NTV Telugu

Ashok selvan – keerthi pandian: పెళ్లితో ఒక్కటైనా అశోక్ సెల్వన్- కీర్తి పాండియన్.. ఫోటోలు వైరల్..

Thamil Hero

Thamil Hero

చిత్ర పరిశ్రమలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరింది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది…

తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. ‘పిజ్జా 2’, ‘భద్రమ్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో చాన్నాళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల్ని ఇతడు పలకరించాడు. కానీ పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయారు. అయితే 2020లో వచ్చిన ‘ఓ మై కడవులే’ హిట్ కావడం ఇతడికి చాలా ప్లస్ అయింది.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు..

ఇదిలా ఉండగా ఈ హీరో తనతో పాటు సినిమాలు చేసిన హీరోయిన్ కీర్తి పాండియన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా వీరిద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ సందర్భంగా వారికి సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ‘బ్లూ స్టార్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. అశోక్ సెల్వన్ గతేడాది సూపర్ హిట్ మూవీ పోర్ థోజిల్తో పాటు 5 సినిమాల్లో నటించారు. తెలుగులో నిన్నిలా నిన్నిలా మూవీ చేశారు. నవరస, మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్లలోనూ నటించారు..

Exit mobile version