NTV Telugu Site icon

గుండె చ‌ప్పుడును విన‌డం కాదు… ఎప్పుడైనా చూశారా?

గుండె ల‌బ్‌డ‌బ్ అని కొట్టుకుంటుంది.  డాక్ట‌ర్ స్కెత‌స్కోపుతో గుండె శ‌బ్దాన్ని విన‌వ‌చ్చు.  గుండె కొట్టుకునే స‌మయంలో వ‌చ్చే శ‌బ్దాన్ని బ‌ట్టి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు.  ఆరోగ్య‌వంతుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.  చిన్న‌ప్ప‌టి నుంచి పుస్త‌కాల్లో చ‌దువుకున్న పాఠ‌మే.  అయితే, గుండె కొట్టుకునే శ‌బ్దాన్ని విన‌గ‌లం కాని, గుండె శ‌బ్దాన్ని చూడ‌లేం.  గుండె చుట్టూ ర‌క్ష‌ణ‌గా ఎముక‌లు వ‌ల‌యంగా ఉంటాయి.  గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డే వారికి అత్య‌వ‌స‌రంగా గుండె మార్పిడి చేయాల్సి రావొచ్చు.  

Read: ఆర్టీసి కీల‌క నిర్ణ‌యం: ఉద‌యం 4 గంట‌ల నుంచే సిటీ స‌ర్వీసులు…

ఇలా గుండెను మార్పిడి చేయించుకున్న వారిలో సిసిలియా-జాయ్ అడమౌ అనే మ‌హిళ ఒక‌రు.  గుండె మార్పిడి చికిత్స‌తో పాటుగా, ఆమెకు మూత్ర‌పిండాల స‌ర్జ‌రీ, బ్రెయిన్ సర్జ‌రీ వంటి మేజ‌ర్ ఆప‌రేష‌న్లు జ‌రిగాయి.  గుండె స‌ర్జ‌రీ కార‌ణంగా  ఆమె హృదయంపై గుర్తులు అలానే మిగిలిపోయాయి.  గుండె కొట్టుకునే విధానం ఆ గుర్తుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.  టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతున్న‌ది.