అచ్చెన్న ప్రజల్ని మరిచిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్‌కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్‌కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా?
అచ్చెన్న అందుబాటులో లేరని కేడర్ ఆందోళన
వైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా.. ఆ పార్టీ కేడర్ మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ రాజకీయ ఎత్తుగడలకు అచ్చెన్నతోపాటు పార్టీ కేడర్ ఉక్కిరి బిక్కిరైన ఉదంతాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో తమ ఎమ్మెల్యేను కలిసి బాధలు చెప్పుకొందామని టీడీపీ కేడర్ భావించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారని ఆనందించాలో.. తమకు పిలిస్తే పలికేంత దూరంలో లేరని బాధపడాలో అర్థం కావడం లేదని అంటున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
విజయవాడ లేదా విశాఖలోనే ఉంటున్నారట
ప్రస్తుతం టెక్కలిలో టీడీపీ కేడర్ చాలా ఇబ్బంది పడుతోంది. చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు రెండు సార్లు జైలుకెళ్లడంతో.. తమ నాయకుడికే ఇలా ఉంటే.. మన పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందారు. ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హవా నడుస్తోంది. ఇంతలో ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెన్న బిజీ అయిపోయారు. టెక్కలికి.. ఇక్కడ టీడీపీ కేడర్‌కు సమయం కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ సమయం విజయవాడ లేదంటే విశాఖకే పరిమితం అవుతున్నారట అచ్చెన్నాయుడు.
ఎర్రన్నాయుడిని గుర్తు చేసుకుని బాధపడుతున్న కేడర్
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలిలో అచ్చెన్న మార్కు కనిపించడం లేదన్నది కేడర్ చెప్పేమాట. జిల్లాలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా పార్టీ కేడర్‌కు సమయం కేటాయించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్న నుంచి అదే ఆశించిన టీడీపీ తమ్ముళ్లకు నిరాశ తప్పడం లేదని అంటున్నారు. తమ నేతను కలుసుకోవాలంటే విజయవాడ, లేదా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు కార్యకర్తలు. అందుకే మా అచ్చెన్న టెక్కలిని మర్చిపోయారని కేడర్ చెవులు కొరుక్కుంటోందట. నలుగురు కార్యకర్తలు కలిస్తే తమ బాధలు ఒకరికి ఒకరు చెప్పుకొని ఊరట చెందుతున్నారట. మరి.. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు గమనించారో లేదో..?
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!