Site icon NTV Telugu

దేశంలో రైతుల ఆత్మహత్యలు… ఏపీ@3, తెలంగాణ@4

2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా 18 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 4,006 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం గమనించాల్సిన విషయం.

Read Also: వాహనదారుల్లో రాని మార్పు

2020లో రైతుల ఆత్మహత్యల విషయంలో కర్ణాటక (2,016) రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (563), నాలుగో స్థానంలో తెలంగాణ (466), ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ (735), ఆరోస్థానంలో ఛత్తీస్‌గఢ్ (532) ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2020 ఏడాదిలో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. వీరిలో రైతులు 7 శాతం (10,677) ఉన్నారు. వీరిలో రైతులు 5,579 మంది, వ్యవసాయ కూలీలు 5,098 మంది ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. మరోవైపు తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు కూడా రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 466 మంది రైతుల్లో 419 మంది పురుషులు ఉండగా.. 47 మంది మహిళలు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయకూలీల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

Exit mobile version