దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీకి చెందిన నేతలు వరుసగా ఢిల్లీలో మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది. మొన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసారు. ఇప్పుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు. పార్టీ పెద్దలతో తాజా రాజకీయాలపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
Also Read: Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా.. అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్
మరోవైపు బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ తదితర నేతలను కలిశారు. పార్టీ అగ్రనేతలతో మరికొన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీకి పవన్ వచ్చి వెళ్ళాక, ఆంధ్ర బిజెపిపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.
ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తుల అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పొత్తులు ఎత్తులకు సంబంధించి బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ వివరించారు. టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకతను బీజేపీ అగ్రనేతలకు పవన్ కల్యాణ్ వివరించినట్లు తెలుస్తోంది. పొత్తుతో వచ్చే లాభాలు, పెట్టుకుంటే నష్టాలను… కొన్ని సర్వేలను బీజేపీ నేతలకు పవన్ ఇచ్చారు. ఈ క్రమంలో బంతి బీజేపీ కోర్టులో వేశారు. ఏదో ఒకటి తేల్చి చెప్పాలని బీజేపీ నాయకత్వాన్ని జనసేనాని కోరారు.
Also Read:BRS Ministers: అభివృద్ధిపై చర్చకు ప్రధాని సిద్ధమా?.. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రులు
అయితే, టిడిపితో పొత్తుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ససేమిరా అంటున్నారని సమాచారం. పవన్ ప్రతిపాదనలను సోము వీర్రాజుతో పార్టీ పెద్దలు చర్చిస్తారా? పవన్ ఈక్వేషన్స్ పై సోము అభిప్రాయం తీసుకుంటారా? పవన్ కల్యాణ్ చెప్పిన దానితో సోము ఏకీభవిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. టిడిపితో పొత్తు వద్దని అధిష్టానానన్నే సోము వీర్రాజు ఒప్పిస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
