మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఇక, లోకేష్ మంగళగిరిలో ఓడిన తర్వాత అయినా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని గ్రహిస్తారు అని అనుకున్నాం అన్నారు మంత్రి కన్నబాబు.. చంద్రబాబు ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని సూచించిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారన్నది స్పష్టం చేశాయన్నారు. రాజధాని ప్రాంతం గ్రామాల్లోను పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులే గెలిచారు కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. ట్వీట్ లు పెట్టేటప్పుడు సమాచారం చెక్ చేసుకుని పెట్టడం లోకేష్ తెలుసు కోవాలి హితవుపలికారు కన్నబాబు.. దళితులు చేస్తున్న ఉద్యమాన్ని అల్లరిమూకలుగా విమర్శలు చేశారు టీడీపీ నేతలు అని మండిపడ్డ ఆయన.. దళితులను కించపరచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.. టీడీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన సొంత సంపదకు విఘాతం కలుగుతుందనే చంద్రబాబు ఆవేదన అన్న ఆయన.. టీడీపీ నేతల సంపద సృష్టి కలలు చెల్లాచెదురవుతున్నాయని అచ్చెన్నాయుడు ఆవేదన అంటూ సెటైర్లు శారు.. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని అచ్చెన్నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించిన కన్నబాబు.. అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అధ్యక్షుడా లేక అమరావతి టీడీపీకి అధ్యక్షుడా? అని ఎద్దేవా చేవారు.