Site icon NTV Telugu

మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్.. హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం

తొలుత ఈనెల 15న గవర్నర్‌ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండగా… వైద్యులు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈనెల 17న ఆయన్ను అత్యవసరంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం కోలుకోవడంతో ఈనెల 23న డిశ్చార్జ్ అయ్యి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో గవర్నర్ మళ్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. కాగా గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version